‘ఎన్నికల కమిషనర్ పై భౌతికదాడులు జరగొచ్చు’..  అమిత్ షాకు లేఖ రాసిన కన్నా

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 03:49 PM IST
‘ఎన్నికల కమిషనర్ పై భౌతికదాడులు జరగొచ్చు’..  అమిత్ షాకు లేఖ రాసిన కన్నా

Updated On : March 18, 2020 / 3:49 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు. రమేష్ కుమార్ కు ఉన్నతస్థాయి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ పై వైసీపీ నేతలు అభ్యంతరకరమైన విమర్శలు చేశారని ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు 25 శాతం ఏకగ్రీవం కావడం అప్రజాస్వామికం అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది. ఆ లేఖను కేంద్ర హోంశాఖకు లేఖ తాను రాయలేదంటున్నారు ఎన్నికల కమిషనర్‌. ప్రభుత్వ తీరుపై లేఖలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఏక పక్షంగా సాగుతున్నాయంటూ ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లాలో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడం వల్లే హింస చెలరేగిందని అందులో ప్రస్తావించారు. తనకు ప్రాణహాని ఉందని, కేంద్రం నుంచి రక్షణ కల్పించాలని రమేశ్‌ కుమార్ కోరుతున్నట్లు లేఖలో ఉంది. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రబలగాలను పంపాలని ఆలేఖలో కోరారు. ఏపీ రాజకీయాల్లో ఈసీ లెటర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

సరాసరి సిఎం జగన్ నే టార్గెట్ చేసిన ఈ లేఖతో ఒక్కసారిగా వైసీపీ అప్రమత్తమైయ్యింది. ఆరాతీయడం మొదలుపెట్టింది. ఈలోగా అసలు ఈ లేఖకు ఈసీ రమేష్ కుమార్ కు ఎలాంటి సంబంధంలేదని ఎన్నికల కార్యాలయం స్పష్టం చేసింది. ఈసీ రమేష్ కుమార్ స్వయంగా 10టీవీతో మాట్లాడారు. తాను ఈ లెటర్ ను ఎవరికి పంపలేదని తేల్చేశారు. తాను హోంశాఖకు ఎలాంటి లేఖ పంపలేదని అన్నారు.