Puvvada Sudhakar : అమరావతి ఉద్యమంలో చేయి చేయి కలిపి పోరాడుదాం : పువ్వాడ సుధాకర్
అమరావతి రాజధాని నిర్మాణం జరగకూడదని ఆర్ధిక వనరులు ఇచ్చే ప్రాంతాన్ని ఆర్ 5 జోన్ కి ఇచ్చారని పేర్కొన్నారు. నిడమర్రు గ్రామం ఎలక్ట్రానిక్ సిటీగా ఉందని...ఇక్కడ ఇవ్వాలనుకున్నారని తెలిపారు.

Puvvada Sudhakar
Puvvada Sudhakar : అమరావతి ఉద్యమంలో చేయి చేయి కలిపి పోరాడుదామని అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకుడు పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు. ఆర్ 5 జోన్ పోరాటంలో వీర మరణం పొందితే మన బిడ్డలు గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. అలా కాకుండా మనకు రాజకీయాలే ముఖ్యం అనుకుంటే బిడ్డలు అసహ్యంగా మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమంలో చేయి చేయి కలుపుదాం…ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఇది తెలియచేయడానికే ఈ ప్రజా చైతన్య యాత్ర అని అన్నారు. నిడమర్రులో ఆర్ 5 జోన్ రైతు చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించారు.
బహిరంగ సభలో రైతుల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ
న్యాయ పోరాటం ద్వారా రైతులు న్యాయం సాధించారని తెలిపారు. ఇప్పుడు సీఎం కొత్త సమస్యను తెచ్చారని.. ఆర్ 5 జోన్ తెచ్చారని వెల్లడించారు. అమరావతి రాజధానిలో 5 శాతం భూమి ఉందని కొందరు చెపుతున్నారని పేర్కొన్నారు. లాండ్ పూలింగ్ స్కీం పూర్తి అయ్యాక పేదల ఇళ్లకు 5 శాతం భూమి ఇచ్చారని చెప్పారు. సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 53 కింద 5 శాతం భూమిని రిజర్వ్ చేశారని తెలిపారు.
Amaravati Capital Issue: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. విచారణ జూలైకి వాయిదా
అమరావతి రాజధానిలో అతి ఎక్కువ ఓపెన్ స్పేస్ కేటాయించారు… ఇలా ప్రపంచంలో ఎక్కడ జరగలేదన్నారు. ఆర్ 1 అంటే రాజధాని గ్రామాలని, ఆర్ 2 జోన్ లో విల్లాలకు కొంత భూమి(493 ఎకరాలు)ను కేటాయించారని తెలిపారు. ఆర్ 3 జోన్ లో మధ్యస్థ జన సాంద్రత నుండి ఎక్కువ మంది జీవించే ప్రాంతం కు 11,390 ఎకరాలు కేటాయించారని, బహుళ అంతస్తుల కోసం ఆర్ 4 జోన్ కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6000 ఎకరాలు రిటర్నబుల్ ఫ్లాట్ లు ఇచ్చారని, ఇంకా 5000 ఎకరాలు కేటాయించాలన్నారు. రాజధానిలో నివసించే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత సీఆర్డీఏదని స్పష్టం చేశారు.
రాజధాని మాస్టర్ ప్లాన్ 2 దశల్లో పూర్తి కావాల్సివుందన్నారు. 2050 వరకు పేదలు రాజధానికి వస్తారని, వారికి ఇళ్లు అపార్ట్ మెంట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. ఇలా లక్ష కుటుంబాలకు ఇల్లు కట్టేందుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రి పేదలకు సెంట్ భూమి ఇవ్వాలనుకున్నారని పేర్కొన్నారు. అయితే, దీనిపై సెంట్ భూమి ఇవ్వడానికి వీల్లేదని న్యాయస్థానాలకు వెళ్ళామని.. హైకోర్టు అంగీకరించి 107 జీఓను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.
Supreme Court Notices : అమరావతి రాజధానిపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు
సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు అయిందన్నారు. దీనితో చట్టాన్ని మార్చాలని చూశారని.. మార్చారని తెలిపారు. ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను సీఆర్డీఏ నుండి తప్పించారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో వాదన వినిపించానని…విచారణ దశలో ఉందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం జరగకూడదని ఆర్ధిక వనరులు ఇచ్చే ప్రాంతాన్ని ఆర్ 5 జోన్ కి ఇచ్చారని పేర్కొన్నారు. నిడమర్రు గ్రామం ఎలక్ట్రానిక్ సిటీగా ఉందని…ఇక్కడ ఇవ్వాలనుకున్నారని తెలిపారు.
నిడమర్రులో 675 ఎకరాలు సెంట్ భూమి ఇవ్వాలని అనుకున్నారు.. మందడంలో బిజినెస్ పార్క్ ను 60 ఎకరాలు సెంట్ భూమికి, కృష్ణాయపాలెంలో రీజనల్ సెంటర్ లో 70 ఎకరాలు ఇస్తున్నారు, ఐనవోలులో టౌన్ సెంటర్ నుండి 70 ఎకరాలు ఇస్తామంటున్నారని.. అమరావతి ఆదాయ మార్గాలు దెబ్బతీయడానికి చూస్తున్నారని పేర్కొన్నారు. నిడమర్రులో అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ముగిసింది.
Amaravati-parliament : విజభన చట్టం ప్రకారమే ‘అమరావతి ’ ఏర్పాటైంది : ఏపీ రాజధానిపై కేంద్రం సమాధానం
పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. మండుటెండలో పాదయాత్రలో మహిళా రైతులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కృష్ణయ్యపాలెం, మందడం, తుళ్ళూరు, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర అనంతరం నిడమర్రులో ఆర్ 5 జోన్ రైతు చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో రైతుల నాయకులు మాట్లాడారు. అందరం కలిసి కట్టుగా పోరాడాలన్నారు.