School Lock - Kakinada
School Lock – Kakinada : కాకినాడలోని అశోక్ నగర్ లో ఉన్న రవీంద్రభారతి స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా స్కూల్ ఎందుకు తెరవడం లేదని ప్రిన్సిపాల్ ని నిలదీశారు. పాఠశాల మరమ్మతులు అని చెప్పి మూసివేశారని, ఇంకా తెరవలేదని వివరణ ఇచ్చారు.
అయితే, అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. పాఠశాలకు నోటీసులు ఇచ్చి గేటుకు తాళాలు వేశారు. సుమారు 2కోట్ల రూపాయల మేర అద్దె చెల్లించలేదన్నారు. పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలని
తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read..Eating On Floor : కింద కూర్చుని భోజనం చేయడం మంచిదా? కాదా?
రవీంద్రభారతి స్కూల్ లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. 290 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. స్కూల్ కి తాళం వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తమ పిల్లల పరిస్థితి ఏంటి? అని తల్లిదండ్రులు వాపోతున్నారు. భవనంలో మరమ్మతులు చేస్తున్నాం అందుకే స్కూల్ ని క్లోజ్ చేశామని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెబుతోంది. రోజులు గడుస్తున్నా వారు ఇలానే చెబుతున్నారు.
దాంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీశారు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగుచూసింది. గత నాలుగేళ్లుగా భవన యజమానికి, స్కూల్ యాజమాన్యానికి కోర్టులో వివాదం నడుస్తోంది. తాజాగా భవన యజమానికి అనుకూలంగా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దాంతో భవన యజమాని స్కూల్ కి తాళాలు వేశాడు. దాంతో 290మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అందులో 23మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ చదువుతున్నారు.
Also Read..Is Walking Good Or Bad For Knee Pain
మంచి కార్పొరేట్ స్కూల్లో తమ పిల్లలను చదివిస్తున్నాం, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తల్లిదండ్రులు ఆశించారు. కానీ, అందుకు భిన్నంగా ఇక్కడ జరిగింది. పది రోజులుగా స్కూల్ మూసివేసి ఉండటంతో తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. అవసరమైతే పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ చెబుతున్నారు తప్ప స్కూల్ ఎప్పుడు తెరుస్తామో అన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెరిగింది. అకడమిక్ ఇయర్ మధ్యలో ఇలా స్కూల్ ని మూసివేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆవేదన చెందుతున్నారు.
కాగా, ఇప్పటివరకు ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోలేదు. దీంతో వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రవీంద్రభారతికి 150 విద్యాసంస్థలు ఉన్నాయి.