Lokesh ki Jahnavi kapoor appreciation
Janhvi Kapoor: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన, మానవీయ నిర్ణయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈమేరకు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది.
Virosh Wedding: పెళ్లి బంధంతో ఒకటైన విజయ్- రష్మిక.. ఫోటోలు షేర్ చేసిన కొత్త జంట
ఈ వ్యాధి సోకిన వారి కండరాలు క్రమంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ వ్యాధి చికిత్స కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, దీని ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. అంతస్తొమత లేని పునర్విక కుటుంబం.. దాతల సహకారంతో రూ.10 కోట్లు వరకు సమకూర్చారు. కానీ, ఇంకా రూ. 6 కోట్లు అవసరం అయ్యాయి.
అలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్. పాప ఇంజెక్షన్ కి అవసరమైన ఆ రూ. 6 కోట్లు సమకూర్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. ఈమేరకు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) సైతం స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ‘మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే, నెటిజన్స్ సైతం నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.