Lunar Eclipse 2023 : చంద్రగ్రహణం.. రేపు దుర్గమ్మ ఆలయం మూసివేత, మళ్లీ దర్శనం ఎప్పుడంటే..

రేపు సాయంత్రం అమ్మవారికి ప్రదోష కాల హారతులు నిర్వహించి అనంతరం 6.30 గంటలకు కవాట బంధనం చేస్తారు. Lunar Eclipse 2023

Lunar Eclipse 2023 : చంద్రగ్రహణం.. రేపు దుర్గమ్మ ఆలయం మూసివేత, మళ్లీ దర్శనం ఎప్పుడంటే..

Lunar Eclipse 2023 Vijayawada Kanaka Durga Temple Will Close Tomorrow (Photo : Google)

Updated On : October 27, 2023 / 5:57 PM IST

Vijayawada Kanaka Durga Close : రేపు రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేయనున్నారు. రేపు (అక్టోబర్ 28) విజయవాడ దుర్గమ్మ ఆలయం మూసివేస్తారు. సాయంత్రం 6గంటల 30నిమిషాలకు అమ్మ వారి ప్రధానాలయం, ఇతర ఉపాలయముల కవాట బంధనమ చేస్తారు. రేపు సాయంత్రం అమ్మవారికి ప్రదోష కాల హారతులు నిర్వహించి అనంతరం 6.30 గంటలకు కవాట బంధనం చేస్తారు.

Also Read : పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు ద్వారకా తిరుమల ఆలయం మూసివేత, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బ్రేక్

చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం వేళ నిర్వహించే నిత్య పల్లకి సేవ నిలిపేశారు. గ్రహణకాలం అనంతరం అనగా 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహిస్తారు. 29వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 29వ తేదీ తెల్లవారుజామున నిర్వహించు ఆర్జిత సేవలు సుప్రభాతం, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన నిలిపివేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన చేశారు.

Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత, ఎందుకంటే..

ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతపడనుంది. 28న సాయంత్రం ఆలయం తలుపులు మూసివేస్తారు. దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మరో రోజుకు వాయిదా వేసుకోవడం మేలని టీటీడీ అధికారులు సూచించారు.

29న తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రకటన చేశారు.