Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత, ఎందుకంటే..

వేకువజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని తెరుస్తారు. శుద్ధి, పున్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు. Tirumala Temple

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత, ఎందుకంటే..

Tirumala Temple Closed (Photo : Google)

Tirumala Temple Closed : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఈ నెలలో ఒక రోజున శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది. అక్టోబర్ 29న పాక్షిక చంద్రగ్రహణం ఉంది. అక్టోబర్ 29న అర్ధరాత్రి 1.05 గంటల నుండి వేకువజామున 2.22 వరకు పాక్షిక చంద్ర గ్రహణం ఉంటుంది.

గ్రహణం కారణంగా ఆలయం తలుపులు మూసివేత..
చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటుశ్రీ వారి ఆలయం మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28 సాయంత్రం 7.05 గంటల నుండి 29వ తేదీ వేకువజామున 3గంటల 15 నిమిషాల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. వేకువజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని తెరుస్తారు. శుద్ధి, పున్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఆలయం తలుపులు తెరుస్తారు.

Also Read..TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఐదు రోజులు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు

8గంటల పాటు మూసివేత..
చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయని, అక్టోబర్ 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.

వీకెండ్, వరుస సెలవులు, పెరటాసి మాసం ఎఫెక్ట్..
మరోవైపు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులు దాదాపు 5 కిలోమీటర్ల మేర శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. అసలే వీకెండ్ కావడం, ఆపై వరుస సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. ఇక పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. దాంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది.

Also Read..ISKON: ఇస్కాన్‭కు వివాదాలు కొత్తేం కాదు? 1965లో ఆ సంస్థ ప్రారంభమైన నాటి నుంచి చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతారు

 

కొండపై భారీ రద్దీ ఉన్న కారణంగా భక్తులు అందుకు అనుగుణంగా తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓవైపు వరుస సెలవులు, మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. కాగా, త్వరలో దసరా సెలవులు రానున్నాయి. దీంతో ఈ నెల మొత్తం కొండపై రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. అటు, ఈ నెలలో 1, 7, 8, 14, 15వ తేదీలలో ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ చేయకూడదని నిర్ణయించింది.

Also Read..Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 కిలోమీటర్ల మేర క్యూలైన్లు, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం