Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 కిలోమీటర్ల మేర క్యూలైన్లు, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 కిలోమీటర్ల మేర క్యూలైన్లు, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala Heay Crowd

Tirumala Heay Crowd : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో కొండపై ఎటూ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు భక్తులో నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులు దాదాపు 5 కిలో మీటర్ల మేర శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. వరుస సెలవులు, వీకెండ్లు, పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తుల అధిక సంఖ్యలో తిరుమలకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.

దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు, నారాయణ వనంలోని ఉద్యాన వనంలోని షెడ్డులు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఐదు రోజులు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు

క్యూలైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగు నీరు అందిస్తున్నారు. వసతి కోసం కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీడీపీ తెలిపింది.అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.