Dwarka Tirumala : పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు ద్వారకా తిరుమల ఆలయం మూసివేత, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బ్రేక్

మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ చేసి 6 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి.

Dwarka Tirumala : పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు ద్వారకా తిరుమల ఆలయం మూసివేత, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బ్రేక్

Dwarka Tirumala Temple closed

Lunar Eclipse – Dwarka Tirumala Temple close : పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న బ్రహ్మోత్సవాలకు బ్రేక్ పడనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం (అక్టోబర్ 28,2023)న మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఆలయం అధికారులు మూసివేయనున్నారు.

మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ చేసి 6 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి. మరోవైపు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భక్తులు రద్ది కొనసాగుతోంది.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత, ఎందుకంటే..

గురువారం రాత్రి స్వామి వారి కళ్యాణం రమణీయంగా జరిగింది. కళ్యాణోత్సవానికి హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, టీటీడీ సభ్యులు మెకా శేషుబాబు హాజరయ్యారు. ఉత్సవాల నాలుగో రోజైన ఈ రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగునుంది.