మోడీపై ఫేస్‌బుక్‌లో పోస్ట్: చిత్తూరు జిల్లాలో అరెస్ట్

  • Published By: vamsi ,Published On : January 7, 2020 / 02:33 AM IST
మోడీపై ఫేస్‌బుక్‌లో పోస్ట్: చిత్తూరు జిల్లాలో అరెస్ట్

Updated On : January 7, 2020 / 2:33 AM IST

ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్టులు పెట్టిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించి పోస్ట్ చేసినందుకు అతనిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు.

పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా ములకలచెరువుకు చెందిన కామలూరి జైనుల్లా(34) ఇటీవల ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టాడు.

దీనిపై బీజేపీ మండల అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, గోపాల్‌రెడ్డి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జైనుల్లాపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.