Wife Unknown Chat : ఫోన్ చాటింగ్ అనుమానంతో భార్యను వదిలేసిన భర్త.. న్యాయ పోరాటానికి దిగిన భార్య

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భార్యపై అనుమానంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్త తనకు కావాలంటూ ఆ యువతి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో తన అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది.

Wife Unknown Chat : ఫోన్ చాటింగ్ అనుమానంతో భార్యను వదిలేసిన భర్త.. న్యాయ పోరాటానికి దిగిన భార్య

Wife Chating With Unknown Person

Updated On : March 23, 2021 / 4:53 PM IST

wife chat with unknown person : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారి కాపురం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్త తనకు కావాలంటూ ఆ యువతి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో తన అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఒకే గ్రామానికి చెందిన శివమణి, మాధవి ప్రేమించుకున్నారు. ఆమెకు పెద్దలు వేరే వివాహం కుదిర్చారు. పెళ్లికి ఒకరోజు ముందు వారిద్దరూ విజయవాడ గుడిలో వివాహం చేసుకొన్నారు.

అనంతరం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు ఇరుపక్షాల పెద్దలకు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిద్దరినీ నారాయణపురంలో వేరే కాపురం పెట్టించారు. ఆరు నెలలు గడిచిందో లేదో గొడవలు మొదలయ్యాయి. తన భార్య ఫోన్‌లో వేరే వారితో చాటింగ్‌ చేస్తోందన్న అనుమానం మొదలైంది. కాపురం చేయలేనంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. యువతి బంధువులతో కలసి సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్తను కాపురానికి పంపాలని అత్తమామలను కోరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంటి నుంచి వెళ్లి వేరే కాపురం పెట్టుకున్నారు. వాడు మా మాట వినడు. వాడికి మేమేం చెబుతామని తల్లి దండ్రులు అంటున్నారు.

నా కాపురం నిలబెట్టండి : మాధవి
బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిరితే మాయమాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నారాయణపురంలో వేరేగా ఉంటూ జీవిస్తున్నాం. మూడు నెలల నుంచి నాతో సరిగా ఉండడం లేదు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్‌ చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు.. నేను ఇంటికి రాను.. నాకు నీకు సంబంధం లేదని చెప్పి ఫోను పెట్టేశాడు’ నాకు నా భర్తకావాలి.. నా అత్తమామల వల్లే నా భర్త వెళ్లిపోయాడు. నా కాపురం నిలబెట్టాలి’ అంటూ యువతి వాపోయింది.