Alla Ramakrishna Reddy : వైసీపీకి బిగ్ షాక్ : ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.

Alla Ramakrishna Reddy (1)

Alla Ramakrishna Reddy Resigned : వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత విధేయుడైన ఆర్కే రాజీనామా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ఆర్ కుటుంబానికి ఆర్కే చాలా సన్నిహితమైన వ్యక్తి. వైసీపీ నుంచి ఆర్కే రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో లోకేష్ పై పోటీ చేసి ఆర్కే గెలిచారు. అయితే ఆర్కే అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆర్కే ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చిందన్న అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

వైసీపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం
వైసీపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా ఆర్కే అసంతృప్తిగా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేయడంపై ఆర్కే వ్యూహాలు అంతుపట్టడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఆర్కే సైలెంట్ అయిపోయారు. కాగా, మంగళగిరి నియోజకవర్గం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా ఉంది. అయితే నియోకవర్గంలో అంతర్గత రాజకీయాలే కారణమని తెలుస్తోంది.

మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గంజి చిరంజీవిని కొత్త ఇంచార్జీగా నియమిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చాలా రోజుల నుంచి ఆర్కే చెబుతూవస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చింది అన్నది చర్చనీయాంశంగా మారింది.

Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ కు ఏపీలో భారీగా పంట నష్టం.. నేటి నుంచి కేంద్ర ప్రత్యేక బృందాల క్షేత్రస్థాయి పరిశీలన

ఒకవేళ తనకు పోటీ చేసే ఉద్దేశం లేకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. ఆర్కే పోటీ చేయకుండా పార్టీలో కూడా కొనసాగవచ్చు. కానీ, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఆర్కే రాజీనామా చేశారంటే కచ్చితంగా ఆయకు అసంతృప్తి ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.

ఆర్కే రాజీనామా ఎందుకు చేశారంటే?
మంగళగిరికి చిరంజీవిని కొత్త ఇంఛార్జ్‌గా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా పార్టీ తీరుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందనే భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
అలాగే నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్కేకు పోటీగా దొంతి వేమారెడ్డి పార్టీ కార్యాలయం తెరిచారు. ఈనేపథ్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆర్కే చెప్పినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు