Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ కు ఏపీలో భారీగా పంట నష్టం.. నేటి నుంచి కేంద్ర ప్రత్యేక బృందాల క్షేత్రస్థాయి పరిశీలన

డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు చేపట్టనున్నారు. డిసెంబర్ 25న యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనుంది.

Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ కు ఏపీలో భారీగా పంట నష్టం.. నేటి నుంచి కేంద్ర ప్రత్యేక బృందాల క్షేత్రస్థాయి పరిశీలన

Cyclone (2)

Michaung Cyclone Heavy Crop Loss : మిచాంగ్ తుఫాన్ కు ఏపీలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కేంద్ర ప్రత్యేక బృందాలు నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్నారు. ప్రత్యేక బృందాలు పంట నష్టంపై అంచనా వేయనున్నాయి. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు చేపట్టనున్నారు. డిసెంబర్ 25న యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనుంది. ఇంకా మిగిలిపోతే ఈనెల 31 వరకు దరఖాస్తుదారులకు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 31న అధికారులు తుది జాబితా తయారు చేయనున్నారు.

మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. మిచాంగ్ తుపాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుపాను రూపంలో ముప్పు పొంచి ఉంది. డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. 18కి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Cyclone Threat : ఏపీకి మరో తుఫాన్ గండం.. మిచాంగ్ బీభత్సం నుంచి కోలుకోకముందే!

ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడనం భారీ తుపాన్ గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం వాతావరణ శాఖ వెల్లడించింది.