botsa satyanarayana
chandrababu..pawan kalyan : ఏపీలో శాంతి భద్రతలు లేవు..హత్యలు, అత్యాచారాలు, గంజాయి మాఫియా ఇలా రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల బాపట్లలో 10వ తరగతి చదివే బాలుడు హత్య అంశంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఈ అంశంపైనా..ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ విమర్శించారు. ఈ విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తు ఇద్దరిపై ప్రతివిమర్శలు చేశారు.
శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం క్లారిటీ గా ఉంది అంటూ స్పష్టం చేశారు..జనసేన రౌడీల పార్టీ అంటూ విమర్శించారు. తనకు ప్రాణహాని ఉందని తన కోసం సుపారీ గ్యాంగ్ ను దించారు అంటూ వపన్ కాకినాడలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..? అని ప్రశ్నించారు. ఇలా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన దురదృష్టకరం.. విద్యార్థిని చంపిన దోషుల మీద చట్టపరంగా శిక్ష పడుతుందన్నారు.మా పార్టీ వాళ్ళు ఆ ఘటనను ఎక్కడ సమర్ధించలేదని..బాలుడి హత్య ఘటనను రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా బొత్స చంద్రబాబు టిడ్కో ఇళ్ల గురించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తు..టీడీపీ ప్రభుత్వం కట్టించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టి తామే కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని..దానికి వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ఎవడికో పుట్టిన బిడ్డను తనకే పుట్టారని చెప్పుకునే దరిద్రుడు జగన్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స విరుచుకుపడ్డారు. చంద్రబాబు వయస్సకు తగ్గట్టు మాట్లాడుతున్నారని..టిడ్కో ఇళ్ల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు.
అసెంబ్లీ లో చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చారు? మేము విధంగా మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకుంటారా?..ముందుగా అనటం.. తరువాత ఒకరు అన్నారని ఏడవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.చంద్రబాబు కి 40ఏళ్ల తర్వాత బీసీలకు గుర్తొచ్చారా?అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.మూడు పార్టీలు కలసి వచ్చినా… 30పార్టీలు వచ్చినా మేము సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు.