Botsa Satyanarayana: ఉద్యోగులతో దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నాం: మంత్రి బొత్స

ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.

Botsa Satyanarayana: పీఆర్సీపై ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్న మాటలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని..ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా అమరావతి కార్యాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల తీరుపై మండిపడ్డారు. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని.. మాకు మాటలు రావా.. మాట్లాడలేకనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స..ఉద్యోగులతో ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నామని అన్నారు. ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే అపోహలు తొలగించడానికే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి, చర్చలకు రావాలని అంటున్నట్లు మంత్రి వివరించారు. అసలు నాయకులు రాకుండా కిందిస్థాయి నేతలు వచ్చి మూడు అంశాలపై లేఖ ఇచ్చారని మంత్రి బొత్స తెలిపారు.

Also Read: High Court: న్యాయమూర్తులపై పోస్ట్‌లు.. ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్!

లేఖ ఇచ్చిన వాటిపై చర్చలకు రావాలని కోరగా ఉద్యోగసంఘాల వాళ్ళు మాత్రం రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక వేళ తమను అలసత్వంగా తీసుకుంటున్నారేమో.. వాళ్ళు పిలిచే వరకూ మేము కూడా చర్చలకు వెళ్లకూడదని అనుకున్నామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారికి కొత్త పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు వస్తాయి ఆమేరకు ప్రాసెస్ జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు. ఎంత మందికి అయితే అంతమందికి జీతాలు ఇచ్చుకుంటూ పోతామని మంత్రి పేర్కొన్నారు.

Also read: Tirumala – Tirupati: తిరుమల, తిరుపతిలో మూడ్రోజుల పాటు మెగా మ్యూజికల్ ఈవెంట్

ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే అంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు.. మరి ట్రెజరీ ఉద్యోగుల్ని పని చేయొద్దు అంటున్నారని.. జీతాల విషయంలో ఈ ద్వంద వైఖరి ఏంటంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. ట్రెజరీ ఉద్యోగులు సహకరించకపోతే జీతాలు ప్రాసెస్ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంఘాల నాయకులు ప్రభుత్వంపై, మంత్రులపై మాటలు తూలనాడొద్దని..అటువంటి మాటలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.

Also read: Jobs : సిఐఎస్ ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

ట్రెండింగ్ వార్తలు