Jogi Ramesh: డర్టీ బాబు టిష్యూ మేనిఫెస్టోని ప్రకటించారు.. చించి చెత్తబుట్టలో వేయండి
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్‌లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
- Harishth Thanniru
- Published On : May 29, 2023 / 02:18 PM IST
Minister Jogi Ramesh
Minister Jogi Ramesh: చంద్రబాబు నాయుడు టిష్యూ మేనిఫెస్టోను ప్రకటించాడని, ఆ మేనిఫెస్టోని చించి డస్ట్ బిన్‌లో వేయాలని మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని వాగ్దానాలలో 98శాతం వాగ్దానాలను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మాకు మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవత్ గీత లాంటిదని అన్నారు. 2014లో చంద్రబాబు 650 వాగ్దానాలు చేశారు. పట్టుమని పదికూడా అమలు చేయలేదని విమర్శించారు.
Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు
సిగ్గులేని ఆల్ ఫ్రీ బాబు 1999 నుండి అలాగే నకిలీ మేనిఫెస్టోని ప్రకటిస్తూ వస్తున్నారు. అసలు ఆ పార్టీ, గుర్తు, మేనిఫెస్టో అన్నీకూడా నకిలీవే. ఎన్టీఆర్ నుండి కొట్టేసినవే. మా మేనిఫెస్టోలో 98శాతం అమలు చేశాం. మీకు దమ్ముంటే దీనిపై చర్చకు రాగలరా అంటూ మంత్రి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయటానికే కృషి చేశామని అన్నారు. అమ్మకు వందనం పేరుతో అమ్మ ఒడి చంద్రబాబు కాపీ కొట్టాడని విమర్శించారు. ఏ ఊరువెళ్లినా మేము తెచ్చిన అభివృద్ధి కనపడుతుంది. ఏ ఇంటికి వెళ్లినా మేము చేసిన సంక్షేమం కనిపిస్తుంది. జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాలను చూసి ఇతర రాష్ట్రాలుకూడా అమలు చేస్తున్నాయని మంత్రి అన్నారు.
Gudivada Amarnath : మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా..? : మంత్రి గుడివాడ అమర్నాథ్
నాలుగేళ్లలో నేషనల్ హైవేలు వేయించామని, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. అసలు పొత్తుల్లేకుండా పోటీ కూడా చేయలేని చంద్రబాబు మాపై విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్నారు. జగన్ ధీరుడు, ధీశాలి. మేము సింగిల్‌గానే పోరాడుతాం. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు గల్లంతు కావడం ఖాయమని జోగి రమేష్ అన్నారు. వచ్చే మహానాడు నాటికి ప్రజలు టీడీపీకి పాడె కడతారు. చంద్రబాబు, లోకేష్ చాప చుట్టుకుని సింగపూర్ కో, అండమాన్ కో పారిపోవాల్సిందే. 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? దీపం పథకం అంటున్నాడు అదిచేస్తే గత ఎన్నికలలో మహిళలు చంద్రబాబుకు ఎందుకు దీపం ఆర్పారు అంటూ ప్రశ్నించారు.
TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
రైతుల రుణమాఫీ పేరుతో నిలువునా చంద్రబాబు మోసంచేశాడని విమర్శించారు. యువతకు 20లక్షల ఉద్యోగాలు అని దొంగహామీ ఇచ్చారని, మళ్ళీ ఆ హామీఇస్తే యువతే మీ చెంపలు పగులకొడతారంటూ జోగి రమేష్ హెచ్చరించారు. బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్‌లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్న వ్యక్తి పేదలను కోటేశ్వరుని ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ మేనిఫెస్టోని ప్రజలు చూస్తే చంద్రబాబుని చెప్పులతో కొడతారు. చెత్త మేనిఫెస్టోని చంద్రబాబుకు పార్శిల్ చేస్తామని జోగి రమేష్ అన్నారు.
