Gudivada Amarnath : మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా..? : మంత్రి గుడివాడ అమర్నాథ్

ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర్లు వేశారు.

Gudivada Amarnath : మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా..? : మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath

Gudivada Amarnath : మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా..ఇచ్చిన హామీలు అమలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందా..? అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత మిని మేనిఫెస్టోని ప్రకటించారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. దీంట్లో భాగంగానే గుడివాడ అమర్నాథ్ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా..ఇచ్చిన హామీలు అమలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందా..? 2014 మ్యానిఫెస్టో ఎక్కడ ఉందో చంద్రబాబుకైనా తెలుసా? అంటూ విమర్శలు సంధించారు.

పక్క రాష్ట్రాల నుండి కాపీ కొట్టి విడుదల చేశాడు..ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర్లు వేశారు.14 ఏళ్లు సీఎంగా చేసి ఎంత మందికి ఉద్యోగం ఇచ్చారు..? అని ప్రశ్నించారు.4 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వంలో యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారు అంటూ చెప్పుకొచ్చారు.

20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడండూ మండిపడ్డారు.2014లో 2 వేలు నిరుద్యోగ బృతి అన్నాడు ఇవ్వలేదు.. ఇప్పుడు 3 వేలు ఇస్తాను అంటున్నాడు అంటూ విమర్శించారు.చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు

కాగా మహానాడునాడులో చంద్రబాబు మినిమేనిఫెస్టోని విడుదల చేశారు.వాటిలో మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత పేరిట పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అలాగే, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పేరిట మరో మూడు కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.

మహిళల కోసం మహాశక్తి
ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో..
18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి యువతి, మహిళకు ఆడబిడ్డ నిధి
జిల్లా పరిధిలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం
తల్లి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు
ఎంత మంది పిల్లలు ఉన్నా ఓకే.. స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు

కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఆర్థిక సహాయం
దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
20 లక్షల మందికి ఉద్యోగాలు
ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి

రిచ్ టు పూర్ కింద పేదలను సంపన్నులను చేయడం
5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు