TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకకమైన ఉందా? బాబు హయాంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకోలేదా? వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జేడీపీ నేడు మొదట స్థానంలో ఉంది

TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

AP Politics: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చావుకు చంద్రబాబు నాయుడే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోబించడానికి కారణం చంద్రబాబని, మళ్లీ ఆయన ఫోటోకు చంద్రబాబు దండ వేయడమేంటని బొత్స విమర్శించారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార వైయస్ కాంగ్రెస్ పార్టీకి విపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి మాటాల తూటాలు పేలుస్తుండగా.. ఇక నెట్టింట్లో సైతం విమర్శల పర్వం కొనసాగుతోంది.

TDP Mahanadu 2023 : గొడ్డలి పోటో.. గుండె పోటో తేలాలి

ఇక ఈ సందర్భంగా మంత్రి బొత్స స్పందిస్తూ ‘‘చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకకమైన ఉందా? బాబు హయాంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకోలేదా? వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జేడీపీ నేడు మొదట స్థానంలో ఉంది. జగన్ సీఎం అయ్యాక వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమాలైనా చంద్రబాబు హయాంలో ప్రజలకు చేరిందా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Muhammad Iqbal: ‘సారే జహాసె అచ్చ’ గేయ రచయితనీ వదల్లేదు.. డీయూ సిలబస్ నుంచి మహ్మద్ ఇక్బాల్ ఔట్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘విద్య, వైద్యంకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమాలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు. అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబు దోచుకు తిన్నారు. తన సామాజిక వర్గానికి దోచి పెట్టారు. కానీ ఇప్పుడు ప్రతి రంగాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డినే. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశారు. చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు విడుదల చేసిన ప్రజలు నమ్మరు. చంద్రబాబు ఎప్పుడైనా మేనిఫెస్టో హామీలను అమలు చేశారా?’’ అని అన్నారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ అనుబంధ ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు లేదు

సీబీఐ గురించి స్పందిస్తూ ‘‘రోజుకొక డ్రామా సీబీఐ ఆడుతుందా, లేక మేము అడుతున్నమా? ఒకేసారి అవినాష్ రెడ్డిని విచారణ చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు.