Nadendla Manohar : ఐదేళ్లు గంజాయికి అడ్డాగా తెనాలి.. రాజకీయ లబ్ధి కోసమే జగన్ టూర్.. మంత్రి నాదెండ్ల ఫైర్..!

Nadendla Manohar : గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా..? అంటూ మంత్రి నాదెండ్ల మండిపడ్డారు.

Nadendla Manohar

Nadendla Manohar : గత ఐదేళ్లు తెనాలిని గంజాయికి అడ్డాగా చేశారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్ (Nadendla Manohar) ఫైర్ అయ్యారు. రెండు గ్యాంగులు తెనాలిని అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరిపారంటూ మండిపడ్డారు.

గంజాయి బ్యాచ్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్ తెనాలికి రావాలని సూచించారు.

Read Also : Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు.. నోటీసులు ఇచ్చే ఛాన్స్..!

గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం తెనాలి ప్రశాంతంగా ఉందన్న ఆయన రాజకీయ లబ్ది కోసం జగన్ వచ్చి అలజడులు సృష్టించవద్దన్నారు.

జగన్ తెనాలి వచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అలజడులు ప్రోత్సహించవద్దని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకుని రావద్దని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు.

ఐతానగర్ నగర్ ఏరియాలో ఇళ్లలో గంజాయి పెంచిన దారుణమైన పరిస్థితి తెనాలిలో తీసుకొచ్చారని, ఐదేళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా చేశారంటూ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రజలపైనే కాకుండా పోలీసులపైనా గంజాయి మత్తులో దాడి చేశారని ధ్వజమెత్తారు.

3.73 లక్షల మందికి రేషన్ బియ్యం పంపిణీ :
అదేవిధంగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 29,760 షాపుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. రెండు రోజులుగా 35. 81 లక్షల మందికి రేషన్ పంపిణీ చేసినట్టు తెలిపారు. 3.73 లక్షల మందికి ఇంటింటికీ సరఫరా జరిగిందన్నారు.

Read Also : Kaleshwaram KCR : ఈ నెల 11నే కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. అసలు రీజన్ ఇదే..!

కొన్ని చోట్ల టెక్నికల్ సమస్యలు వచ్చినప్పటికీ వాటికి రెక్టిఫై చేసామన్నారు. ప్రతీ నెలా ఒకటవ తేదీ నుండి 15 తేదీవరకూ రేషన్ సరఫరా జరుగుతుందని, ఫోర్టబిలిటీ అవకాశం ఉండగా ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల సూచించారు.