Kaleshwaram KCR : ఈ నెల 11నే కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. అసలు రీజన్ ఇదే..!

Kaleshwaram KCR : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న హాజరుకానున్నారు. కేసీఆర్ అభ్యర్థన మేరకు విచారణ తేదీ వాయిదా పడింది.

Kaleshwaram KCR : ఈ నెల 11నే కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. అసలు రీజన్ ఇదే..!

KCR

Updated On : June 2, 2025 / 6:07 PM IST

Kaleshwaram KCR : మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 5న విచారణకు ఆయన హాజరుకావాల్సిందిగా విచారణ తేదీ వాయిదా పడింది. ఈనెల 11న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు బీఆర్ఎస్ అధినేత హాజరయ్యే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

ముందుగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయగా కేసీఆర్‌ మరికొంత సమయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో విచారణ తేదీని కమిషన్‌ జూన్ 11కు వాయిదా వేసింది.

జూన్ 2న తెలంగాణ భవన్‌లో జరగాల్సిన మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయీదా
పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 9వతేదీన కమీషన్ ముందు హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు హాజరు తరువాత తదుపరి పరిణామాలను బట్టి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ విజ్ఞప్తి చేయగా జస్టిస్ పీసీ అంగీకరించినట్టు తెలిసింది. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతిని బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు.. నోటీసులు ఇచ్చే ఛాన్స్..!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్‌‌తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరు కాలేనని, జూన్ 11న తప్పక హాజరవుతానంటూ కేసీఆర్ కమిషన్‌కు సమాచారం అందించారు. కేసీఆర్ అభ్యర్థన మేరకు కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని 11కు వాయిదా వేసింది.