Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు.. నోటీసులు ఇచ్చే ఛాన్స్..!

Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు బీజేపీ సిద్ధమైంది. నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు.. నోటీసులు ఇచ్చే ఛాన్స్..!

BJP Raja Singh

Updated On : June 2, 2025 / 5:40 PM IST

Raja Singh : బీజేపీలోనూ అసంతృప్తి సెగ మొదలైనట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read Also : Xiaomi Phones : బిగ్ అలర్ట్.. ఇకపై ఈ షావోమీ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ రావు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత కొన్నాళ్లుగా అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాజసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముందుగా ఆయన కు నోటిసులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది.

జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటికి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతోనే రాజాసింగ్‌కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనుంది. నోటీసులు కూడా ఇప్పటికే సిద్దమైనట్టు తెలుస్తోంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కూడా ఆయన మద్దతు పలకడం క్రమశిక్షణ ఉల్లంఘనలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.