Nara Lokesh: గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి నారా లోకేశ్ భేటీ.. విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు..
అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు.

Nara lokesh
Nara Lokesh America Tour: ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా సాగుతున్న అమెరికా పర్యటనలో లోకేశ్ పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. తాజాగా.. శాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వివిధ విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్లు బికాస్ కోలే, రావు సూరపనేని, చందు తోటలతో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధుల్ని లోకేశ్ కోరారు. యువతో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్ వారి వద్ద ప్రతిపాదించారు. సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు లోకేశ్ కు తెలియజేశారు.
అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్చక్చర్ హబ్ గా తయారవుతోంది. విశాఖపట్టణంలో డాటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామని తెలిపారు. పీపీపీ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండని కంపెనీ ప్రతినిధులను కోరడం జరిగిందని తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతం. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించండని కోరడం జరిగిదని లోకేశ్ తెలిపారు.
Also Read: తిరుమలలో నేను చాలా పనులు చేయాలి- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
అదేవిధంగా.. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడంకోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరడం జరిగిందని లోకేశ్ చెప్పారు. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యులుకండి అని కంపెనీ ప్రతినిధులను కోరడం లోకేశ్ తెలిపారు.