Nara Lokesh : ఏపీలో రాజకీయం వేడెక్కింది. కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. మద్యంలో అవినీతి చేయలేదని జగన్ తన బిడ్డలపై ప్రమాణం చేయగలడా అని సవాల్ చేశారు లోకేశ్.
సూపర్ 6లో మెజార్టీ హామీలు 9 నెలల్లోనే అమలు చేశామని ఆయన తెలిపారు. మిగిలినవి ఓ క్రమపద్ధతిలో అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దశలవారీగా అన్ని హామీలు అమలు చేసి తీరతామన్నారు. మద్య నిషేధం, సీపీఎస్ రద్దు వంటి హామీలు విస్మరించింది జగనే అని ఆరోపించారు లోకేశ్.
Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష హోదాపై మరోసారి ప్రస్తావన
”జగన్ కు చట్టాలను ఉల్లఘించటం అలవాటు కాబట్టి మేము కూడా చట్టం ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? ఎమ్మెల్యేగా గెలవకుండా సభకు వస్తా అన్నట్లుగా జగన్ వితండవాదం ఉంది. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మెజారిటీకి భయపడి హడావుడిగా బెంగుళూరు నుంచి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెంగళూరు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు.
జగన్ 40లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలి. జగన్ అన్నట్లుగా 40 లక్షల ఉద్యోగాల కల్పన జరిగి ఉంటే ఇక నిరుద్యోగ సమస్య ఎక్కడుంది? జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సజ్జల స్క్రిప్ట్ పంపిస్తుంటే మండలిలో అది చదవటం తప్ప బొత్స సత్యనారాయణ చేతుల్లో ఏముంది? 3 రాజధానులపై జగన్ స్టాండ్ ఏంటో పాపం బొత్స ఏం చెప్పగలరు? అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
అహంకారానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అచ్చు జగన్ లా ఉంటుంది..
”అహంకారానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అచ్చు జగన్ లా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను జగన్ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు. ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో జగన్ ఇప్పటికైనా సమీక్షించుకోవాలి. వైసీపీకి ప్రతిపక్ష ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారు.
Also Read : ఒకే గొడుగు కిందకు వర్మ, దొరబాబు..! పిఠాపురంలో పవన్ సరికొత్త వ్యూహం..!
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో జగన్ కు భయం పట్టుకుంది. హడావుడిగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో వచ్చారు. జగన్ రెండు రోజుల్లో మళ్లీ బెంగళూరు వెళ్లిపోతారు. డిప్యూటీ సీఎం పవన్ ను కించపరిచేలా జగన్ మాట్లాడారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. సొంత కార్యకర్తలను కూడా జగన్ కలవడం లేదు. వైసీపీ హయాంలో ఉద్యోగ కల్పన జరగలేదు. చట్టాన్ని ఉల్లంఘించడం జగన్ కు అలవాటే.. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. బెంగళూరులో కూర్చుని ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడతారు” అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్.