YS Jagan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష హోదాపై మరోసారి ప్రస్తావన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష హోదాపై మరోసారి ప్రస్తావన

Jagan Mohan Reddy

Updated On : March 5, 2025 / 2:04 PM IST

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జీవిత కాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారు. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: ప్రతి మహిళకు చంద్రబాబు రూ.36 వేలు: వైఎస్ జగన్

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇటీవల అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని బైకాట్ చేశారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ వద్ద మీడియా ప్రస్తావించగా.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ పవన్ అన్నారు. తాజాగా.. పవన్ వ్యాఖ్యలను మీడియా జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ప్రతిపక్ష హోదాకు తక్కువ.. ఆయన జీవిత కాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ప్రతిపక్ష హోదాపైనా జగన్ మరోసారి మాట్లాడారు. గతంలో ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీగా హోదా లాగేస్తానంటే నేను వద్దన్న. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న సమయంలో ఎంత సమయం మాట్లాడతావో అంతసేపు మాట్లాడమని చెప్పాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పేందుకు మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అంటూ జగన్ అన్నారు.