ప్రతి మహిళకు చంద్రబాబు రూ.36 వేలు బాకీ : వైఎస్ జగన్

ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు.. కరపత్రాలు కూడా పంచారు. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు.

ప్రతి మహిళకు చంద్రబాబు రూ.36 వేలు బాకీ : వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy

Updated On : March 5, 2025 / 3:41 PM IST

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు బడ్జెట్ లలో ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు.. కరపత్రాలు కూడా పంచారు. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు.

Also Read:  Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు

గవర్నర్ కు ఇచ్చిన పుస్తకం లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. సోసియేఎకామిక్ సర్వేలో 2024 నుంచి 2025లో 27లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సచివాలయం పని చేసేందుకు లక్ష30 వేల మందికి, గ్రామ వాలంటీర్లుగా రెండు లక్షలు, అప్కాస్ ద్వారా 90 వేల పైనే ఉద్యోగాలు ఇచ్చాం. వైసీపీ ఐదేళ్ల హయాంలో 6 లక్షల 30వేల మందికిపైనే ఉద్యోగాలు ఇచ్చామ‌ని జ‌గ‌న్ అన్నారు. 2019 నుండి 2024 వరకు ఎమ్ఎస్ఎమ్ సెక్టర్ తోపాటు అన్ని సెక్టర్లు కలుపుకుని 40లక్షల పైనే ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పారు. పారిశ్రామిక వ్యక్తులను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండేందుకు భ‌య‌పెడుతున్నార‌ని కూటమి ప్రభుత్వంపై జ‌గ‌న్ ఆరోపణలు చేశారు.

Also Read: PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

18సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు రూ.18వేలు ఇస్తామ‌ని చెప్పారు. ఈ హామీ ఎమైంది బాబు..? సమాధానం చెప్పాలి అంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్రతి మహిళకు చంద్రబాబు 36 వేలు బాకీ ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు.. రాష్ట్ర మొత్తం మహిళలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మహిళలకు సమాధానం చెప్పాలి. స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15 వేలు అన్నారు. ఎంత మంది ఉంటే అన్ని‌ 15 వేలు అంటూ ఊరుఊరు ఊద‌ర‌ కొట్టారు. ఇది ఏమైందో చంద్రబాబు విద్యార్థుల‌కు సమాధానం చెప్పాలని జ‌గ‌న్ ప్రశ్నించారు.

రైతులను కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ కు సంబంధం లేకుండా సంవత్సరానికి 20వేలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండు బడ్జెట్ లలో రైతులకు 40వేలు బాకీ ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన మహిళలకు 45వేలు ఇస్తామని చెప్పారు. రెండు సంవత్సరాలకుగాను కలిపి 50 సంవత్సరాల మహిళలకు 90వేలు బాకీ ఉన్నారు అంటూ కూటమి ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు.

ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నడుస్తుంది. పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తుంది ఏమిటి.? అంటూ జగన్ ప్రశ్నించారు. నా మాటలు న్యాయమూర్తులు కానీ, గవర్నర్ కానీ వింటుంటే అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబును తొలగించాలి అంటూ జగన్ వ్యాఖ్యానించారు.