Gossip Garage : ఒకే గొడుగు కిందకు వర్మ, దొరబాబు..! పిఠాపురంలో పవన్ సరికొత్త వ్యూహం..!

కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

Gossip Garage : ఒకే గొడుగు కిందకు వర్మ, దొరబాబు..! పిఠాపురంలో పవన్ సరికొత్త వ్యూహం..!

Updated On : March 5, 2025 / 3:42 PM IST

Gossip Garage : సొంత నియోజకవర్గంలో పవన్ సరికొత్త వ్యూహం స్టార్ట్‌ చేశారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు.. జనసేనలో చేరబోతున్నారు. పిఠాపురం అడ్డాగా ఇన్నాళ్లు ఢీ అంటే ఢీ అనుకున్న నేతలు.. ఇప్పుడు ఒకే గొడుగు కింద కనిపించబోతున్నారు. మరి ఇది పిఠాపురం రాజకీయాన్ని మలుపు తిప్పుతుందా.. రాబోయే రోజుల్లో ఏం జరిగే చాన్స్ ఉంది.. పిఠాపురం అడ్డాలో జరుగుతున్న చర్చ ఏంటి..

పిఠాపురం.. తెలుగు రాష్ట్రాలు గుర్తుంచుకునే పేరు, చర్చించుకునే పేరు. పవన్‌ కల్యాణ్ అడ్డా. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు మోస్తున్న పవన్.. సరికొత్త వ్యూహానికి తెరతీశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడలో పవన్‌ను కుటుంబసమేతంగా కలిసి జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో కొత్త రాజకీయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

Also Read : వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరినీ వదలం- కూటమి ప్రభుత్వానికి మాజీమంత్రి రోజా వార్నింగ్

ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. అదే రోజు దొరబాబు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అనుచరులు కూడా భారీగా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆవిర్భావ దినోత్సవ వేల.. పిఠాపురం కీలక నేత ఒకరు చేరబోతుండడంతో.. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

పిఠాపురం రాజకీయాన్ని ఏలుతున్న వర్మ, దొరబాబు
అటు వర్మ.. ఇటు దొరబాబు.. కొన్నేళ్లుగా పిఠాపురం రాజకీయాన్ని ఏలుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపించేవి. అలాంటిది ఆ ఇద్దరిని ఒకే ఒకే గొడుకు కిందకు తీసుకురావడంలో.. పవన్ అద్భుతమైన రాజకీయ చతురత చూపించారు. పిఠాపురంలో ఇక తిరుగులేదు అనే లెవల్‌లో వ్యూహం రచించారు.

కూటమిలో ఒకటిగా కలిసి పని చేయగలరా?
దొరబాబు చేరికతో ఇప్పుడు జనసేన బలం మరింత పెరగడం ఖాయం. ఐతే దొరబాబు చేరికతో పిఠాపురం రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

దొరబాబుకు అప్పగించబోయే బాధ్యతలు ఏంటి ?
జనసేనలో చేరుతున్న దొరబాబుకు.. పవన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది కూడా హాట్‌టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కోసం వర్మ సీటు త్యాగం చేశారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇప్పటికీ పదవి దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read : దమ్ముంటే రా.. చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్..

ఇలాంటి టైమ్‌లో పిఠాపురంలో దొరబాబు జనసేనలో చేరడం కొత్త చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడానికి గ్రౌండ్‌ వర్క్ జరుగుతున్న వేళ.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరడం.. రాజకీయంగా ఎలాంటి మలుపులకు కారణం అవుతుందా అనే డిస్కషన్ వడుస్తోంది.

జనసేనతో వర్మకు దూరం పెరుగుతుందనే గుసగుసలు..
పిఠాపురంలో జనసేనతో వర్మకు దూరం పెరుగుతుందనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయ్. ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు మారట్లేదనే చర్చ జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు దొరబాబు జనసేనలో చేరితే.. వర్మతో కలిసి పనిచేయగలరా అనేది అతిపెద్ద ప్రశ్న.

ఐతే ఇద్దరు నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో.. పవన్ తన మార్క్ రాజకీయ చతురత చూపించే అవకాశాలు ఉంటాయని.. సమస్యలను సర్దడంలో ఆయన ఆరితేరారన్నది మరికొందరి అభిప్రాయం. ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. పిఠాపురంలో వైసీపీని తుడిచేయడమే లక్ష్యంగా పవన్ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్.