MLA Nallapareddy : తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

MLA Nallapareddy : తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nallapureddy Prasannakumar Reddy

MLA Nallapareddy Prasannakumar Reddy Comments : తిరుమల నడకదారిలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్ లో మృతి చెందిన చిన్నారి లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తనకు కొన్ని అనుమానాలున్నాయని తెలిపారు. ఆడబిడ్డ విషయం కాబట్టి తనకెందుకో అనుమానంగా ఉందన్నారు.

ఈ మేరకు శనివారం ఆయన నెల్లూరులో మీడియమాతో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. చిన్నారి లక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. లక్షిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Cheetah Kill Girl : తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపేసిన చిరుత

ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అధికారి ధర్మారెడ్డితో మాట్లాడాతానని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి టీటీడీ తరఫున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. మరోవైపు బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనా స్థలాని సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఏఫ్ఓ సతీష్ కుమార్ పరిశిలించారు. దాడికి చేసింది చిరుతా లేక ఎలుగు బంటా అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే నిర్దారణ అవుతుందన్నారు.

దాడి చేసిన జంతువుని బంధించేందుకు బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలుగు బంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధిస్తామని వెల్లడించారు. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమరాలతో పాటు డ్రోన్ కెమరాలు వినియోగిస్తామని చెప్పారు. 7వ మైలు నుంచి నరశింహ స్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా ప్రకటిస్తున్నామని తెలిపారు.

Leopard : 3 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి

ఈ మేరకు లక్షిత తండ్రి దినేష్ శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తమ పాపను చంపింది చిరుతపులేనని ఎలుగుబంటి కాదన్నారు. ఎలుగుబంటి అంతదూరం మోసుకెళ్ళదని చెప్పారు. భవిష్యత్తులో ఏ చిన్నారికి ఇలాంటివీ జరగకూడదని కోరుకున్నారు. తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందారు. తిరుమల నడకదారిలో బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది.

ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది. గతంలో బాలుడిపై దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారిపై చిరుత దాడి చేసింది. చిన్నారి శరీరంపై తీవ్ర రక్త గాయాలు అయ్యాయి.