కన్నతండ్రికే అన్నం పెట్టలేదు.. గాజులు తాకట్టు పెట్టి రైతులకు పరమాన్నం పెడతారట : భువనేశ్వరిపై రోజా సెటైర్

రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 04:22 PM IST
కన్నతండ్రికే అన్నం పెట్టలేదు.. గాజులు తాకట్టు పెట్టి రైతులకు పరమాన్నం పెడతారట : భువనేశ్వరిపై రోజా సెటైర్

Updated On : January 4, 2020 / 4:22 PM IST

రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ

రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పు బెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన భూములు అని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. మీ భర్త చంద్రబాబు లాక్కున్న భూములు తిరిగి ఇప్పించండి అని భువనేశ్వరని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం భువనేశ్వరి పై మండిపడ్డారు.

భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో కన్నతండ్రి ఎన్టీఆర్‌కే అన్నం పెట్టలేని భువనేశ్వరి.. తన గాజులు తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ సెటైర్ వేశారు. చివరి రోజుల్లో తండ్రి ఎన్టీఆర్‌ను భువనేశ్వరి పట్టించుకోలేదని రోజా విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు భువనేశ్వరి ఎందుకు సాయం చేయలేదని రోజా అడిగారు.

మాజీ మంత్రి యనమలపైనా రోజా సెటైర్లు వేశారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారన్న యనమల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ‘పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్ళమని ఎవరు చెప్పారు..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. 18 రోజుల నుంచి రైతులు, మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సకల జనుల సమ్మె కూడా చేపట్టారు. రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చారని ప్రశ్నిస్తున్నారు.

కాగా, వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. నిజమైన రైతులెవరూ ఉద్యమాలు, పోరాటాలు చేయడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని వివరిస్తున్నారు. అమరావతి పంట పొలాల్లో రాజధాని నిర్మాణం సరికాదంటున్నారు. ఒక నగరం నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అదే డబ్బుతో రాష్ట్రాంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయొచ్చని తెలిపారు.

Also Read : లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం