కామన్ మ్యాన్‌లా క్యూలో నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారాయన. హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని రెండవ వార్డు పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేశారు. ఆయన సతీమణి వసుంధర కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో నిల్చుని ఓటువేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని బాలయ్య కోరారు.

కామన్ మ్యాన్‌లా క్యూలో నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

Updated On : March 10, 2021 / 2:53 PM IST

nandamuri balakrishna cast his vote: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారాయన. హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని రెండవ వార్డు పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేశారు. ఆయన సతీమణి వసుంధర కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో నిల్చుని ఓటువేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని బాలయ్య కోరారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78,71, 272 మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 12 కార్పొరేషన్లలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 75 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన మున్సిపాలిటీలను పరిశీలిస్తే.., గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలలో అన్ని వార్డులు ఏకగ్రీవమవడంతో ఆ నాలుగు మున్సిపాలిటీలు మినహాయించి 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో నేడు పోలింగ్‌ జరుగుతోంది. 2,215 డివిజన్లు, 7,552 మంది వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 78,71,272 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 38,72,264, మహిళలు 39,97,840, ఇతరులు 1,168 మంది కాగా, పురుషుల కంటే మహిళలు 1.6 శాతం ఎక్కువగా ఉన్నారు. మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి.