Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన తారకరత్న భార్యాపిల్లలు
చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ నినాదాలు కొనసాగుతున్న వేళ నందమూరి కుటుంబ సభ్యుడు, స్వీర్గీయ నందమూరి తారకరత్న భార్యా పిల్లలు కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ అర్థరాత్రి ప్లకార్డులు ప్రదర్శిస్తు నిరసనలు వ్యక్తం చేశారు.

Tarakaratna wife protested Chandrababu arrest
Tarakaratna wife protested Chandrababu arrest : చంద్రబాబు అరెస్టు(Chandrababu arrest)కు నిరసనగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా అమెరియా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు పలు దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది రాజీకీయ, సినిమా ప్రముఖులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. అరెస్ట్ చేసే విధానం సరికాదని విమర్శించారు.
చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ నినాదాలు కొనసాగుతున్న వేళ నందమూరి కుటుంబ సభ్యుడు, స్వీర్గీయ నందమూరి తారకరత్న భార్యా (Tarakaratna wife Alekhya Reddy) పిల్లలు కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ అర్థరాత్రి ప్లకార్డులు ప్రదర్శిస్తు నిరసనలు వ్యక్తం చేశారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి ముగ్గురు పిల్లలతో సహా చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ నిసనలు వ్యక్తంచేశారు.
“హైదరాబాద్ నుండి రాజమండ్రి” సంఘీభావ ర్యాలీకి మద్దతు తెలిపారు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరత్న గారి సతీమణి శ్రీమతి అలేఖ్యా రెడ్డి వారి ముగ్గురు పిల్లలు పాల్గొన్నారు. I AM With CBN పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తు నిసనలు వ్యక్తం చేశారు.
కాగా.. జనవరి 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్న సందర్భంలో తారకరత్న తీవ్ర అస్వస్థకు గురియ్యారు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేకు ఎన్ని యత్నాలు చేసినా ఫలించలేదు. విదేశీ డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు.ఫలితంగా మృత్యువుతో పోరాడిన తారకత్న అతి చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలిలారు. ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఈరోజు IT ఉద్యోగులు తలపెట్టిన “హైదరాబాద్ నుండి రాజమండ్రి” సంఘీభావ ర్యాలీకి మద్దతు తెలిపిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరత్న గారి సతీమణి శ్రీమతి అలేఖ్యా రెడ్డి గారు మరియు వారి పిల్లలు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan… pic.twitter.com/uzERZogEaH
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో చంద్రబాబు తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తనను రిమాండ్ నుంచి విడుదల చేయలని కోరుతు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కానీ ఊరట దక్కలేదు.
అటు ఏసీబీ కోర్టులోను..హైకోర్టులోను ఊరట దక్కలేదు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేయటం..ఏపీ కోర్టులో చంద్రబాబును రెండురోజులు సీఐడీ కస్టడీకి అప్పగించటం జరిగింది.దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండో రోజు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.