Nara Bhuvaneswari : నిజమే.. అందులో ఏపీ నెంబర్ వన్‌గా మారింది- జగన్ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు

జగన్ సర్కార్ నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాము. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు. Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari Criticise AP Government : ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. హింస, కేసులు, భయపెట్టడంలో ఏపీ నెంబర్ వన్ గా మారిందని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం రావాలని పోరాటం చేస్తున్నాము అని అన్నారామె. తిరుపతిలో ‘నిజం గెలవాలి’ సభలో భువనేశ్వరి మాట్లాడారు.

”ఒక్కదాన్నే తిరుమల దర్శనానికి వెళ్లడం చాలా బాధేసింది. ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యాము. చంద్రబాబును జైల్లో పెట్టి ఇప్పటికి 48 రోజులు అవుతోంది. ఎస్వీ యూనివర్సిటీ నుంచే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది. తిరుమలతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను చంద్రబాబు అభివృద్ధి చేశారు. ప్రతి జిల్లాను పారిశ్రామిక హబ్ గా ఆయన తీర్చిదిద్దారు. చంద్రబాబు ప్రతి జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు.

Also Read : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము

కానీ, జగన్ ప్రభుత్వం పెట్టిన హింస భరించలేక పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అమరరాజా పరిశ్రమ విషయంలో ఇదే జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. ఐఎస్ బీ సంస్థ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. వైసీపీ ప్రభుత్వం భయపెట్టి సంస్థలను వెళ్లగొడుతోంది. జగన్ సర్కార్ నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాము. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు. ఎవరూ భయపడకండి” అని నారా భువనేశ్వరి అన్నారు.

Also Read : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న

ట్రెండింగ్ వార్తలు