Nara Lokesh : ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Nara Lokesh
Nara Lokesh anticipatory bail petition : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో లోకేశ్ ను సీఐడీ A-14గా చేర్చడంతో కోర్టుకు వెళ్లారు.
తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు లోకేశ్. ఆ తరువాత ఏపీలో జరిగిన పలు కీలక పరిణామాలతో ఢిల్లీ వెళ్లారు. ఓపక్క చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ అంటూ పలు అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు.
Nara Lokesh : వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్చారు : నారా లోకేశ్
ఆ తరువాత లోకేశ్ మీడియాతో మాట్లాడుతు..అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారని..అసలు వేయని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను A14గా చేర్చారని.. సంబంధం లేని శాఖ అయినా తనపై కేసు పెట్టటం ఏంటీ ఇదే జగన్ ప్రభుత్వం చేసే పనులు అంటూ మండిపడ్డారు. నా తండ్రి అరెస్ట్ తరువాత తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ఇచ్చానని త్వరలోనే ప్రారంభిస్తానని ఎక్కడ నుంచి ఆపానో అక్కడ నుంచే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు లోకేశ్. తాను పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించాక యాత్రను ఆపే కుట్రలో భాగంగా తనను A14గా చేర్చారు అంటూ విమర్శలు సంధించారు.
Nara Lokesh : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో A14గా లోకేశ్, ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో
కానీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. దీంట్లో భాగంగానే తన పాదయాత్ర కొనసాగించేందుకు..మరోపక్క తండ్రి బెయిల్ వంటి వ్యవహారాలు చూసుకోవాలంటే తాను అరెస్ట్ అవ్వకూడదనే ఆలోచనతో లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో A-1గా ఉన్న చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు హైకోర్టులో దానిపై విచారణ జరగనుంది. ఇటువంటి పరిణామాల మధ్య లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.