Nara Lokesh: దటీజ్ నారా లోకేశ్.. ఒక్క మెసేజ్.. క్షణాల్లో స్పందన.. సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటుతోపాటు..

మంత్రి నారా లోకేశ్ మరోసారి మానత్వం చాటుకున్నారు. సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో..

nara lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలపై వేగంగా స్పందిస్తూ వారికి అన్నివిధాల లోకేశ్ సహకారం అందిస్తూ వస్తున్నారు. తద్వారా ప్రజలచేత ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా.. నారా లోకేశ్ క్షణాల్లో స్పందించడం వల్ల ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరగనుంది.

Also Read: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్

మంత్రి నారా లోకేశ్ సకాలంలో స్పందించడంతో వైద్యులు ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రమేశ్ హాస్పిటల్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవదానంకు అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ కు ఒక్క మెస్సేజ్ పంపించారు. వెంటనే స్పందించిన నారా లోకేశ్ అందుకు సంబంధించిన ఏర్పాట్లుపై దృష్టిసారించారు.

Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఉత్తర్వులు జారీ

గుండెను తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానంను ఏర్పాటు చేయడంతోపాటు, తిరుపతి ఆస్పత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మంత్రి లోకేశ్ మాట్లాడారు. దీంతో సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్ కు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, అవయవ దాత, స్వీకర్త కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఇవాళ సాయంత్రం 7గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుంటూరు రమేష్ ఆస్పత్రి సిబ్బంది గుండెను తరలించనున్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రభుత్వంలో మంత్రిగా నిత్యం బిజీబిజీగా ఉండే నారా లోకేశ్.. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తూ, బాధితులకు అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుండటం పట్ల లోకేశ్ తీరుపై ప్రజలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.