Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Kodali Nani
Kodali Nani Health Condition: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా.. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడారు.
Also Read: వైసీపీ నేత కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
కొండాలి నానికి గుండె సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించారు. కొద్దిరోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న నానికి.. గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్‌కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని శశిభూషణ్ తెలిపారు.
Also Read: పాస్టర్ ప్రవీణ్ కేసు.. కీలకమైన పోస్టుమార్టం రిపోర్ట్.. అనుమానాస్పద సీసీ పుటేజ్ లభ్యం
బంధువులు, సన్నిహితులు, గుడివాడలో పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే కొడాలి నాని ఈ విషయాన్ని మాకు వెల్లడించలేదని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానికి చికిత్స అందిస్తున్నవైద్యులతో మాట్లాడారు. అతని ఆరోగ్యంపై వాకబు చేయడంవల్ల నానికి గుండె సమస్యలు ఉన్నట్లుగా మాకు తెలిసింది. కొడాలి నానికి అందిస్తున్న చికిత్స విజయవంతం కావాలని, త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, గుడివాడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు.