వైసీపీ నేత కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు.

Kodali Nani
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతోనూ బాధపడ్డట్టు సమాచారం. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కొడాలి నానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొడాలి నాని వైసీపీలో ఓ మాస్ లీడర్. అయితే. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఆయన త్వరలోనే అరెస్ట్ అవుతారంటూ సోషల్ మీడియాలో కూటమి క్యాడర్ పేర్కొంటోంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర మాట్లాడారంటూ నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.
అంతేకాదు, ఓ పాత కేసు తెరమీదకు వచ్చింది. ఆయన పోలీసులను అవమానించేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని మచిలీపట్నంలో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే జాగ్రత్తపడుతూ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్ వేశారు.
Also Read: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..