Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..

మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..

Updated On : March 26, 2025 / 10:07 AM IST

తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పథకం కింద సర్కారు డబ్బులు జమచేసింది. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మొత్తం రూ.199.99 కోట్లను అధికారులు జమ చేశారు. 3.33 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు ఇవి.

తెలంగాణలోని సుమారు 71 శాతం మంది అన్నదాతలకు రైతు భరోసా సాయం అందింది. ఈ పథకం అమలును షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకు 54.74 లక్షల మంది రైతులకు డబ్బులు అందాయి.

Also Read: రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్..

వారి అందరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.4,666.60 కోట్లు వేశారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో సీజన్‌‌కు రూ.6 వేల చొప్పున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు చొప్పున అన్నదాతలకు డబ్బులు వేస్తారు.

ఈ నెల చివరిలోగా.. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. తెలంగాణలో 77 లక్షల మంది రైతు భరోసా పొందేందుకు అర్హులు. 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు గరిష్ఠంగా నల్లగొండ జిల్లాకు రూ.335.50 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డికి (రూ.230.06 కోట్లు) ఉంది.