రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్..

ఈ పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందిస్తారు.

రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్..

Rajiv Yuva Vikasam

Updated On : March 26, 2025 / 8:23 AM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ​రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ రిలీజ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం.

ఈ పథకం కింద జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయనున్నారు. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు మంజూరు చేస్తారు. అలాగే, మున్సిపాలిటీల్లో సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా వీటి మంజూరు ఉంటుంది. 50 వేల రూపాయల యూనిట్‌కు 100% రాయితీ ఇస్తారు.

అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వారి ఎంపిక మండల స్థాయిలో ఎంపీడీవోల ద్వారా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా జరుగుతుంది. ఇక ఈబీసీ వర్గాలకు ఈ పథకం ఆన్‌లైన్‌ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులో ఉంచాయి.

Also Read: ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి..

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు వచ్చేనెల 5 వరకు చేసుకోవచ్చు. మే 20లోపు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయి. అనంతరం అర్హులను ఎంపిక చేసి, ఆ లిస్టులను జిల్లా కమిటీలకు ఇస్తాయి. మే 21 – 31 మధ్య జిల్లా కమిటీలు ఆయా లిస్టులను పరిశీలిస్తాయి.

జూన్‌ 2 – 9 మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తారు. వ్యవసాయేతర స్కీమ్స్‌కు 2025, జులై 1 నాటికి 21-55 మధ్య వయసు ఉండాలి. వ్యవసాయంతో పాటు దాని ఆధారిత స్కీమ్స్‌కి 21-60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు ఉండొచ్చు. ఇక పట్టణాల్లో రూ.2 లక్షలుగా దీన్ని నిర్ణయించారు.

ఈ పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందిస్తారు. వాటిలో మూడింటికి బ్యాంకు రుణం అనుసంధానం ఉంటుంది. మరో మూడింటికి సర్కారు కొంత రాయితీ ఇస్తుంది.. మిగిలిన డబ్బును లబ్ధిదారు పెట్టుకోవాలి.

ఈ పత్రాలు సమర్పించాలి

  • ఆధార్, రేషన్‌కార్డు లేదా ఐటీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
  • డ్రైవింగ్‌ లైసెన్సును రవాణా పథకాల కోసం సమర్పించాలి
  • పట్టాదారు పాసుపుస్తకం నకలును వ్యవసాయ పథకాల కోసం సమర్పించాలి
  • సదరం సర్టిఫికెట్‌ను దివ్యాంగులు సమర్పించాలి
  • అలాగే, దరఖాస్తుదారులు పాస్‌పోర్టుసైజు ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి

రాయితీ డీటెయిల్స్‌

  • రూ.50 వేల వరకు యూనిట్ విలువకు రాయితీ 100% ఉంటుంది. బ్యాంకు రుణం ఉండదు.
  • రూ.50,001- రూ. లక్ష మధ్య యూనిట్ విలువకు రాయితీ 90%, బ్యాంకు రుణం 10%.
  • రూ. 1,00,001-రూ. 2లక్షలు మధ్య యూనిట్ విలువకు రాయితీ 80%, బ్యాంకు రుణం 20%.
  • రూ.2,00,001-రూ. 4లక్షల మధ్య యూనిట్ విలువకు రాయితీ 70%, బ్యాంకు రుణం 30%.