AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఉత్తర్వులు జారీ

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో 93వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఉత్తర్వులు జారీ

CM Chandrababu Naidu

Updated On : March 27, 2025 / 7:58 AM IST

AP Govt: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో 93వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Also Read: Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం..! ఐసీసీ ఆమోదం..!

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 93వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే, ఇందన శాఖతో సంప్రదింపుల తరువాత పథకం అమలు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.

Also Read: Cm Chandrababu : నాలా చట్టం రద్దు చేస్తున్నాం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించినా లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ద్వారా చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగించినట్లయితే 200 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులు చెల్లించాలి. పవర్ లూమ్స్ కూ ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.