Nara Lokesh : చిన్నప్పుడు చెల్లి కావాలని అమ్మను అడిగాను, పెళ్లి అయ్యాక కూతురు కావాలని బ్రహ్మణిని అడిగాను : లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు 

‘‘మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణతో పెంచారు..మొన్న కూడా ఒక చిన్న పదం తూలితే ఫోన్ చేసి తిట్టారు మా అమ్మ..మహిళలుకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్నే శాసిస్తారు..మహిళలను వంట గదికే పరిమితం చేయకుండా గుర్తింపు నిచ్చింది టిడిపి..మహిళలకి ఆర్థిక స్వాతత్య్రం కల్పించింది చంద్రబాబు.

Nara Lokesh : చిన్నప్పుడు చెల్లి కావాలని అమ్మను అడిగాను, పెళ్లి అయ్యాక కూతురు కావాలని బ్రహ్మణిని అడిగాను : లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు 

Nara Lokesh Interesting comments Mahashakti program

Updated On : July 3, 2023 / 4:44 PM IST

Nara Lokesh Mahashakti program at Nellore district : నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (yuvagalam padayatra) నెల్లూరు జిల్లా (Nellore district)లో కొనసాగుతోంది. దీంట్లో భాగంగా లోకేశ్ సోమవారం స్థానిక అనిల్ గార్డెన్స్ లో మహాశక్తి కార్యక్రమం (Mahashakti program)లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల తనకు చాలా గౌరవం ఉందని అంటూ.. తన చిన్ననాటి సంఘటనలను మహిళలతో పంచుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు నాకు చెల్లి కావాలని అమ్మ(Lokesh mother bhuvaneshwari)ను అడిగాను. వివాహం అయ్యాక నాకు కూతురు కావాలని నా భార్య బ్రహ్మణి (Lokesh wife Brahmani)ని అడిగాను.. నాకు ఆడపిల్లలు అంటే అంత ఇష్టం’’ అని తెలిపారు.

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖాయం.. జనసేనతో కలిసి నడిచేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

‘‘మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణతో పెంచారు. మొన్న కూడా ఒక చిన్న పదం తూలితే ఫోన్ చేసి తిట్టారు మా అమ్మ. మహిళలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్నే శాసిస్తారు. మహిళలను వంట గదికే పరిమితం చేయకుండా గుర్తింపు నిచ్చింది టీడీపీ. మహిళలకి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించింది చంద్రబాబు’’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు (chandrababu naidu) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరాలు చేయాలంటే భయపడేవారని కానీ ఇప్పుడు మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

యువతలో చైతన్యం రావాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గంటకో అకృత్యాలు జరుగుతున్నట్టు కేంద్రం నివేదిక ఇచ్చిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించారు అంటూ ఈ సందర్భంగా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మను అవమానించిన సందర్భంలో దాదాపు నెల రోజుల పాటు ఆవేదనకు గురైయ్యానని తెలిపారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా ఎవ్వరు కుటుంబాల్లోని ఆడవారి గురించి ఇలా మాట్లాడలేదు. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి జరుగుతున్నాయన్నారు. తన తల్లి జరిగిన అవమానం మరో తల్లికి జరగకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేైస్తే సంక్షేమం రాదు, సంక్షోభం వస్తుందని.. అభివృద్ధి ద్వారా సంక్షేమం టీడీపీ లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేశ్.

Chandra babu: కేంద్ర మంత్రి జయశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ