Nara lokesh Jr NTR
Jr NTR – Nara Lokesh: జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ లోకేశ్ కు మేనమామ కుమారుడు అనే విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ కు ఎన్టీఆర్ బావ అవుతాడు. దీంతో బావ ఎన్టీఆర్ కు లోకేశ్ ప్రతీ సంవత్సరం వలెనే ఈఏడాది కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. @tarak9999 మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ రాబోయే సినిమాలు మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం మరియు సమృద్ధిని దీవిస్తాడు అని తెలిపారు.
I wish @tarak9999 a very happy birthday. All the very best for your upcoming movies and may God bless you with good health and abundance.
— Lokesh Nara (@naralokesh) May 20, 2023
కాగా నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత జనార్దన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాల సభను నేడు మే 20 సాయంత్రం 5 గంటల నుండి KPHB లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ భారీ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుపాటి వెంకటేశ్, దత్తాత్రేయ, బాలకృష్ణ, సీతారాం ఏచూరి, D రాజా, పురంధేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్,.. పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు.
కానీ తాత తాత అంటూ గొప్పగా చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలకుదూరంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన వేరే కారణాలు చెప్పొచ్చు కానీ అసలు విషయం మాత్రం వారి కుటుంబాల మధ్య ఉండే అంతర్గత విషయాలు అనేది తేటతెల్లంగా తెలుస్తోంది. ఈరోజు (మే20)జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ముందుగానే తన ఫ్యామిలీతో ఏర్పాటు చేసుకున్న కమిట్మెంట్స్ ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సభకు హాజరుకాలేకపోతున్నట్టు ఎన్టీఆర్ తెలిపారు. కానీ అసలు విషయం మాత్రం అదికాదనే పలువురు అభిప్రాయపడతున్నారు. గత కొంతకాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి, నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కావాలనే తారక్ ఈ వేడుకలకు దూరంగా ఉండటానికి ముందుగానే ప్లాన్ వేసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అటు సిని పరిశ్రమ నుంచి ఇటు రాజకీయ నేతలు ఇంతమంది వస్తుంటే మనుమడు ఎన్టీఆర్ రాకపోవటం కాస్తంత వెలితి అనే చెప్పాలి. ఇంతమంది హీరోలు, సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్న తరుణంలో, ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్, తెలుగు రాజకీయాల్లో చర్చ కూడా మొదలైంది. నేడు జరగనున్న ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి పిలిచిన అందరు హీరోలలో కొంతమంది రాకపోతే ఎవరూ పట్టించుకోరు కానీ, అందరూ వచ్చి ఒక్క ఎన్టీఆర్ మాత్రం రాకపోతే అది కచ్చితంగా పెద్ద వార్త అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.
Rajamouli Family : సింహాద్రి రీ రిలీజ్ లో రాజమౌళి ఫ్యామిలీ హంగామా.. ఎవరెవరు వచ్చారో తెలుసా?
అలాగే పెద్దాయన జయంతి సభకు ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, రానా, శివరాజ్ కుమార్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. మరింతమంది హీరోలు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి రమ్మని అధికారికంగా వీరందరికి ఆహ్వానాలు పంపించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం స్వయంగా అందించారు. నందమూరి రామకృష్ణ స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానించారు. అయినా ఎన్టీఆర్ ఈ వేడుకలకు దూరంగా ఉండటం వైరల్ గా మారింది.