AP Flood : దావరమడుగులో విషాదం..రక్షించబోయి NDRF సభ్యుడు మృతి

వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. చల్లా శ్రీను ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు.

AP Flood : దావరమడుగులో విషాదం..రక్షించబోయి NDRF సభ్యుడు మృతి

Nellore

Updated On : November 20, 2021 / 2:31 PM IST

NDRF Man Died : ఏపీలో వాన బీభత్సం సృష్టిస్తోంది. కుంభవృష్టిగా వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది. రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. భారీ వాహనాలు, బస్సులు సైతం కొట్టుకపోతుండడంతో వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులకు సహాయం అందించేందుకు..వారిని పునరావాస శిబిరాలకు చేర్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఇతర టీమ్ సభ్యులు రంగంలోకి దిగారు. అయితే..నెల్లూరు జిల్లా దావరమడుగులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు NDRF సభ్యుడు చనిపోవడం అందర్నీ కలిచివేసింది.

Read More : Hyderabad Traffic Police : ఒకే తప్పు..రిపీట్, 141 పెండింగ్ చలాన్లు

పెన్నా నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నది పరివాక ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. వరద ఉధృతి అధికంగా ఉండడంతో దావరమడుగు, ఇతర ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. చల్లా శ్రీను ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు. నడుంకు తాడు కట్టుకుని..వరద ప్రవాహంలో దిగాడు. ఆ సమయంలో అతను ధరించిన లైఫ్ జాకెట్ ఊడిపోయింది. దీంతో నీటిలో మునిగి చనిపోయాడు. స్పాట్ లో తమ కళ్లెదుటే అతను చనిపోవడంతో ఇతర సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More : Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు

చరిత్రలో తొలిసారి గండికోట జలాశయం నుంచి మైలవరంకు లక్షా 60వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. మైలవరం నుంచి పెన్నానదికి 11 గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. గండికోటలో పూర్తి స్థాయి నీటి మట్టం.. 26.85 టీఎంసీలు. పెన్నా, కుందూ నది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.