మద్యంతాగి..నడిరోడ్డుపై షర్టువిప్పేసి..మహిళా ఎస్సైపై గ్రామవాలంటీర్ వీరంగం..తిట్ల పురాణం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళా ఎస్సైపై వాలంటీర్ భర్త తిట్ల పురాణం అందుకున్నాడు. విచక్షణారహితంగా బూతులు తిట్టాడు. మద్యం తాగి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అడిగినందుకు ఎస్సై రోజాలతపై మరో వాలంటీర్ భర్త అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. బూతులతో ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు.
ఆత్మకూరులోని 21వ వార్డుకు చెందిన వాలంటీర్..మరో వాలంటీర్ భర్త అర్ధరాత్రి మద్యం తాగి వస్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్సై రోజాలత లాక్‌డౌన్ నిబంధనలు పాటించరా? అంటూ వారిని ప్రశ్నించగా అతడు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. నడిరోడ్డుపై షర్టు విప్పేసి వీరంగం సృష్టించాడు.నానా హంగామా చేశాడు. అతని చర్యలను అక్కడే ఉన్న పోలీసులు వీడియో తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరుపున బాధ్యతాయుతంగా పనులు చేయాల్సిన వాలంటీర్లు ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Here>>నగ్నఫోటోలు పంపమని బెదిరించిన యువకుడి అరెస్ట్