పద్మశ్రీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు తెలుగు వారికి దక్కిన పురస్కారాలు..
తమ సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవైనప్పటికీ పెద్దగా ప్రచారం పొందకుండా, గుర్తింపు లేకుండా సమాజానికి మేలు చేసిన వ్యక్తులను గుర్తించి కేంద్ర సర్కారు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
Padma Shri Awards
- 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు
- తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ
- సీసీఎంబీ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌కు కూడా
Padma Awards: రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఈ సారి 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న వారిలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి ఉన్నారు. ఆయనకు పాడి, పశుసంవర్థక విభాగాల్లో ఈ పురస్కారం దక్కింది.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సీసీఎంబీ శాస్త్రవేత్త)కు కూడా పద్మశ్రీ దక్కింది. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై 30 ఏళ్లుగా చేస్తున్న రీసెర్చ్ చేస్తున్నారు.
ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల ఉన్న Unsung heroesలకు అధికంగా దక్కాయి. వెనుకబడిన వర్గాలు, దళిత సముదాయాలు, ఆదివాసీ గిరిజన తెగలు, వసతులు లేని ప్రాంతాలవారు ఇందులో ఉన్నారు. దివ్యాంగులు, మహిళలు, పిల్లలు, దళితులు, గిరిజనుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వీరిని ఈ అవార్డులతో కేంద్ర సర్కారు గౌరవించింది. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పారిశుద్ధ్యం, స్థిర అభివృద్ధి వంటి రంగాల్లో వీరు చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది.
అన్‌సంగ్ హీరోస్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూకశ్మీర్‌కు చెందిన బ్రిజ్ లాల్ భట్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుద్రీ థాటి, ఒడిశాకు చెందిన చరణ్ హెంబ్రామ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్‌కు చెందిన ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యాకు కూడా ఈ విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది.
తమ సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవైనప్పటికీ పెద్దగా ప్రచారం పొందకుండా, గుర్తింపు లేకుండా సమాజానికి మేలు చేసిన వ్యక్తులను Unsung heroes అంటారు. వీరిని గుర్తించి కేంద్ర సర్కారు ఈ పురస్కారంతో గౌరవించింది.
మరోవైపు, కర్ణాటకకు చెందిన అంకె గౌడను సాహిత్యం, విద్య రంగాల్లో పద్మశ్రీ-2026 అవార్డు వరించింది.
ఫుల్ లిస్ట్ ఇదే..
- అంకె గౌడ
- ఆర్మిడా ఫెర్నాండెజ్
- భగవందాస్ రైక్వార్
- భిక్ల్యా లడాక్య ధిండా
- బ్రిజ్ లాల్ భట్
- బుధ్రీ టాటి
- చరణ్ హెంబ్రామ్
- చిరంజీ లాల్ యాదవ్
- ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్య
- గఫ్రుద్దీన్ మేవాతీ జోగి
- హల్లి వార్
- ఇందర్‌జీత్ సింగ్ సిద్ధు
- కే పాజనివేల్
- కైలాష్ చంద్ర పంత్
- ఖేమ్ రాజ్ సుంద్రియాల్
- కొల్లక్కాయిల్ దేవకి అమ్మ జీ
- కుమారస్వామి తంగరాజ్
- మహేంద్ర కుమార్ మిశ్రా
- మీర్ హాజిబాయి కసంబాయి
- మోహన్ నాగర్
- నరేష్ చంద్ర దేవ్ వర్మ
- నీలేశ్ వినోద్‌చంద్ర మండ్లేవాలా
- నూరుద్దీన్ అహ్మద్
- ఒతువార్ తిరుత్తణి స్వామినాథన్
- పద్మా గుర్మెట్
- పొఖిలా లేఖ్తేపి
- పున్నియమూర్తి నటేశన్
- ఆర్ కృష్ణన్
- రఘుపత్ సింగ్
- రఘువీర్ తుకారాం ఖేడ్కర్
- రాజస్థపతి కలియప్ప గౌండర్
- రామారెడ్డి మామిడి
- రామ్‌చంద్ర గోడ్బోలే, సునీత గోడ్బోలే
- ఎస్ జీ సుశీలమ్మ
- సంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్
- షఫీ షౌక్
- శ్రీరంగ్ దేవబా లాడ్
- శ్యామ్ సుందర్
- సిమాంచల్ పత్రో
- సురేష్ హనగవాడి
- తాగా రామ్ భీల్
- టేచి గుబిన్
- తిరువారూర్ భక్తవత్సలం
- విశ్వ బంధు
- యుమ్నామ్ జాత్రా సింగ్
