Padma Awards 2026: పద్మ పురస్కారాల్లో వికసించిన తెలుగు కీర్తి.. 11 మందికి పద్మశ్రీ
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించగా, ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చింది.
Padma Awards 2026 Telugu States Representative Image (Image Credit To Original Source)
- 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాల ప్రకటన
- 131 మందికి పద్మ అవార్డులు
- 5 మంది పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ
- 11 మంది తెలుగు వాళ్లకు పద్మశ్రీ
Padma Awards 2026: 2026 సంవత్సరానికి కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌తో పాటు, మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ దక్కింది. తెలంగాణ నుంచి చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), దీపికా రెడ్డి (కళలు), గూడూరు వెంకట్ రావు (వైద్యం) సహా పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
పద్మ పురస్కారాల్లో తెలుగు కీర్తి వికసించింది. 113 పద్మశ్రీ అవార్డుల్లో 11 మంది తెలుగు వారికి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించగా, ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చింది. ఇందులో తెలుగు యాక్టర్లు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇందులో మరణానంతరం బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, కేరళకు చెందిన అచ్యుతానందన్ కు పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఇక ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎన్ రాజన్, కేరళకు చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి.నారాయణన్ ను పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది కేంద్రం.
పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న తెలుగువారు..
ఆంధ్రప్రదేశ్
రాజేంద్ర ప్రసాద్ – కళలు
మాగంటి మురళీ మోహన్ – కళలు
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) – కళలు
వెంపటి కుటుంబ శాస్త్రి – సాహిత్యం, విద్య
తెలంగాణ
రామారెడ్డి మామిడి (మరణానంతరం) – పాడి, పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు గుర్తింపు
పల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి – వైద్యం
చంద్రమౌళి గడ్డమనుగు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
దీపికా రెడ్డి – కళలు
గూడూరు వెంకట్ రావు – వైద్యం
కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
డాక్టర్ కుమారసామి తంగరాజ్ – జన్యుసంబంధ పరిశోధనలు
Also Read: 113 మందికి పద్మశ్రీ అవార్డులు..
