Harish Shankar : అన్‌బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. మనమంతా ఒకటే ఫ్యామిలీ అంటూ హరీష్ శంకర్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ లాగా పవన్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడని ఫ్యాన్స్ నమ్మారు. (Harish Shankar)

Harish Shankar : అన్‌బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. మనమంతా ఒకటే ఫ్యామిలీ అంటూ హరీష్ శంకర్..

Harish Shankar

Updated On : January 25, 2026 / 8:06 PM IST

Harish Shankar : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గతంలో ట్విట్టర్లో హరీష్ శంకర్ పై విమర్శలు చేస్తూ కొంతమంది నెగిటివ్ గా మాట్లాడటంతో హరీష్ శంకర్ పలువురిని బ్లాక్ చేసాడు. హరీష్ శంకర్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తున్నారు. మార్చ్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం.(Harish Shankar)

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ లాగా పవన్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడని ఫ్యాన్స్ నమ్మారు. దీంతో గతంలో హరీష్ బ్లాక్ చేసిన పవన్ ఫ్యాన్స్ తమని అన్ బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ అభిమాని క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టి అందర్నీ అన్ బ్లాక్ చేయమన్నాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్వయంగా వచ్చి దర్శకుడిని అన్ బ్లాక్ చేయడం ఇదే మొదటిసారేమో అది పవన్ సినిమా రేంజ్.

Also Read : Padma Awards 2026 : రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ తో సహా పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..

దీంతో హరీష్ శంకర్ వెంటనే స్పందించి.. గతాన్ని మరిచి, అందరం ఒక కుటుంబంలా కలిసి సినిమాను జరుపుకుందాం అంటూ ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు. మరింతమంది ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో హరీష్ శంకర్ వాళ్ళను కూడా అన్ బ్లాక్ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి ఫ్యాన్స్, దర్శకులు, హీరోలు అందరూ సినిమా కోసమే అని అంటున్నారు నెటిజన్లు.