Padma Awards 2026 : రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ తో సహా పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..

సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.(Padma Awards 2026)

Padma Awards 2026 : రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ తో సహా పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..

Padma Awards 2026

Updated On : January 25, 2026 / 6:59 PM IST

Padma Awards 2026 : నేడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అన్ని రంగాలలో కలిపి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.(Padma Awards 2026)

Also See : Pawan Kalyan : సింగ్ లుక్ లో పవన్ కళ్యాణ్.. మహారాష్ట్రలో పర్యటన.. ఫోటోలు వైరల్..

గత సంవత్సరం నవంబర్ లో బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.

బాలీవుడ్ సీనియర్ సింగర్ అల్కా యాగ్నిక్ కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.

తెలుగులో రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తమిళ్, తెలుగు, బాలీవుడ్ సినిమాలలో మెప్పించిన ఒకప్పటి స్టార్ హీరో మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ కి చెందిన నటుడు అరవింద్ వైద్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల్ షాకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ నటుడు అనిల్ రస్తోగికి, బెంగాల్ నటుడు, నిర్మాత ప్రోసేన్‌జిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

Also See : Nithya Menen : ‘అలా మొదలైంది’కి పదిహేనేళ్ళు.. అప్పటి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నిత్యామీనన్..