Nellore Corporation : 8 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవం.. పోటీలో 206 మంది

నెల్లూరు కార్పొరేషన్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య తుది జాబితా విడుదల చేశారు.

Nellore Corporation

Nellore Corporation : నెల్లూరు కార్పొరేషన్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య తుది జాబితా విడుదల చేశారు. 54 డివిజన్లు ఉన్న నెల్లూరులో 8 డివిజన్లు ఏకగ్రీవం కాగా 46 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ 46 డివిజన్ల నుంచి 206 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 7,8,12,20, 24,37, 40 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు.

చదవండి : Nellore : జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికను చెరువు గట్టువద్దకు లాక్కెళ్లి

ఇక మరో 11 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 54 డివిజన్లకు 471 నామినేషన్లు నమోదు కాగా నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ జరిగిన తర్వాత 46 డివిజన్లకు గాను 206 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 471 నామినేషన్లలో వివిధ కారణాలతో 39 నామినేషన్లను అధికారులు అనర్హులుగా తేల్చారు. మరో 226 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

చదవండి : Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట