Nellore : జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికను చెరువు గట్టువద్దకు లాక్కెళ్లి

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.

Nellore :  జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికను చెరువు గట్టువద్దకు లాక్కెళ్లి
ad

Nellore :  నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. పెరుగు ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు యువకుడు నోట్లో గుడ్డలు కుక్కి చెరువు గట్టువద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అఘాయిత్యం చేస్తుండగా బహిర్భుమికి వచ్చిన వారు గమనించి గట్టిగ కేకలు వేశారు.

చదవండి :  అనంతపురంలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

దీంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. బహిర్భుమికి వచ్చిన వారు బాలికను ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయం బందువులకు తెలిపారు. దీంతో వారు కొండాపురం పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల తల్లిదండ్రులు మృతి చెందటంతో చెన్నై నుంచి రామానుజపురంలోని పెద్దనాన్న ఇంటికి వచ్చింది బాలిక.

చదవండి :   17 ఏళ్ళ బాలికపై తండ్రితో సహా 28 మంది అత్యాచారం..