అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది: నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్

నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు.

Nellore Deputy Mayor Md Kaleel comments on Anil Kumar Yadav

Nellore Deputy Mayor Md Kaleel: అనిల్ కుమార్ యాదవ్ వల్లే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు.

”నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు. వైఎస్ఆర్ కాంగెస్ నాయకులమంతా కలిసే ఉన్నాం. మేమంతా కలిసి పని చేస్తాం. జగన్‌ను మళ్లీ సీఎం చేస్తామ”ని ఎండీ ఖలీల్ అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఖలీల్ ను ఎంపిక చేయడాన్ని నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వాగతించారు.

కాగా, నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ వహిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనను అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ సీటును ఎండీ ఖలీల్‌కు కేటాయించారు.

Also Read: ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట