గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 11:18 AM IST
గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

Updated On : July 20, 2020 / 12:43 PM IST

ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్‌ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు.

2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్‌కుమార్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తిరిగి తనను పదవిలో నియమించాలని ఆయన వినతిపత్రం ఇవ్వనున్నరు. అయితే… రమేశ్‌కుమార్‌ విషయంలో గవర్నర్‌ ఎలా వ్యవహరించబోతున్నారు? అన్న విషయమై అధికార వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది.

హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను నియమించవలసి ఉన్నా… గవర్నర్‌ ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే… వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి గవర్నర్‌ తీసుకోబోయే చర్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తనను ఎస్ఈసీగా నియమించకుండా..రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చినా..నిమ్మగడ్డను ఎన్నికల అధికారిగా ఎందుకు నియమించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.