మార్చి 31వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: జగన్

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 02:14 PM IST
మార్చి 31వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: జగన్

Updated On : March 22, 2020 / 2:14 PM IST

ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. దేవుడి దయంతో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 341 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 5 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు.

ఏపీలో మాత్రం కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. అందులో ఒక కేసు నయమైందని, ఒకరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసినట్టు జగన్ చెప్పారు. మార్చి 31 వరకు ఏపీ లాక్ డౌన్ చేయనున్నట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. 

పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. నిత్యావసర సర్వీసులు మాత్రం పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ అవ్వాలని సూచించారు. ప్రజలందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మార్చి 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పోవాలని చెప్పారు. 

See Also | కరోనాను ఓడించేందుకు…లాక్ డౌన్ సరిపోదు : WHO